విదేశాల నుంచి వచ్చి కరోనా అనుమానిత లక్షణాలతో గురువారం మరో ముగ్గురు ఆస్పత్రిలో చేరారు. వీరు ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మొత్తం కరోనా అనుమానిత లక్షణాలున్న వారి సంఖ్య ఈ ఆసుపత్రిలో 9కి చేరింది. ప్రస్తుతం వీరి ఆరోగ్య స్థితిగతుల్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇదివరకే చేరిన వారిలో నలుగురి రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి, మరో ముగ్గురికి కరోనా నెగెటివ్ అని తేలినప్పటికీ వారి ఆరోగ్యం మెరుగు పడేందుకు పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు సౌదీ నుంచి వచ్చిన ఓ మానసిక రోగికి కూడా కరోనా అనుమానిత లక్షణాలుండటంతో అతన్ని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచారు. ఇతని నమూనాలు కూడా పరీక్షకోసం పంపారు. దీంతో మొత్తం 10మంది కరోనా అనుమానిత లక్షణాలతో వైద్యసేవలు పొందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో కరోనా అనుమానిత రోగులకోసం 60 పడకల్ని సిద్ధం చేసే ప్రయత్నంలోనూ ఉన్నారు.
10కి చేరిన కరోనా అనుమానితులు