లారీని ఢీకొన్న కారు:ముగ్గురి మృతి
కడప జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలోని చిన్న ఓరంపాడు వద్ద ప్రధాన రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లంపేట మండలం చెన్నగారిపల్లె గ్రామానికి చెందిన నాగినేని పాపయ్య(42), తల్లి సుబ్బమ్మ (60), కుమారుడు హరిచరణ్ (8) కువైట్ నుంచి చెన్నైకి వచ్చారు. అక్కడి నుంచి స్వగ్రామమైన పుల్లంపేటకు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో ఓరంపాడు ప్రధాన రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారును కడప నుంచి తిరుపతికి వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.