వైకాపాలో రెహ్మాన్‌ దంపతులు


మాజీ ఎమ్మెల్యే, తెదేపా నగర కమిటీ మాజీ అధ్యక్షుడు ఎస్‌ఎ రెహ్మాన్‌, షిరీన్‌ రెహ్మాన్‌ దంపతులు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెహ్మాన్‌ దంపతులు సీఎంను కలిసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రెహ్మాన్‌తో పాటు మాజీ మంత్రి, దివంగత భాట్టం శ్రీరామమూర్తి కోడలు భాట్టం భారతి, తెదేపా నాయకులు గొలగాని రవీశ్వరరావు, అప్పలకొండ, ముస్లిం నాయకులు హబీబ్‌, రహమ్‌తుల్లా బేగ్‌, షాదిక్‌, తదితరులు వైకాపాలో చేరారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.