జీవితంపై విరక్తితో చనిపోతున్నట్లు లేఖ రాసి జేబులో పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బక్కునాయుడుపేటలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వల్లంపూడి పోలీసులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుమ్మాల రాజేష్(20) ఆటో చోదకుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఏం కష్టం వచ్చిందో గాని శనివారర రాత్రి ఇంటిలోని పంకాకు ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తల్లి వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఎస్.ఐ గొంప రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. శవ పంచనామా సమయంలో ఆయన జేబులో ఒక ఉత్తరాన్ని గమనించారు. ‘ నా చావుకు ఎవరూ కారణం కాదు. జీవితంపై విరక్తితో చనిపోతున్నాను. అన్నయ్యను, అమ్మను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ అందులో రాసి ఉన్నట్లు ఎస్.ఐ తెలిపారు.