రైళ్లన్నీ రద్దు

కరోనా వైరస్‌ కారణంగా ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా వెళ్లే అన్ని రైళ్లను ఈ నెల 31వ తేదీ వరకు రైల్వే ఉన్నతాధికారులు రద్దు చేసినట్లు శ్రీకాకుళం రైల్వే బుకింగ్‌ చీఫ్‌ సూపర్‌వైజర్‌ కాశీబాబు తెలిపారు. ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు అన్ని రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. రైళ్లలో ప్రయాణానికి టిక్కెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులకు రైళ్ల రద్దు కారణంగా రిజర్వేషన్‌ టిక్కెట్ల డబ్బులు పూర్తి స్థాయిలో అందిస్తామని చీఫ్‌ బుకింగ్‌ సూపర్‌వైజర్‌ కాశీబాబు తెలిపారు. అయితే ఈ రద్దు చేసుకునే అవకాశాన్ని 30 రోజుల వరకు రైల్వే కల్పించిందని, ప్రయాణికులు గమనించాలని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.