బీసీలకు అన్యాయం

వైకాపా ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ అన్నారు. బూర్జలో డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కూడలి సమీపంలో పార్టీ మండల అధ్యక్షుడు లంక జగన్నాథంనాయుడు, బూర్జ ఎంపీటీసీ మాజీ సభ్యులు టి.వెంకటప్పారావుల ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం పంచాయతీరాజ్‌ చట్టంలో భాగంగా ఇటీవల రూపొందించిన రిజర్వేషన్‌ జీవో కాగితాలకు నిప్పంటించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా హయాంలో 1983లో మాండల వ్యవస్థ ఏర్పడినప్పుడు బీసీలకు 27 శాతం, 73, 74 సవరణలతో 94 చట్టం ద్వారా 34 శాతం రిజర్వేన్‌ కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్‌ను 24 శాతానికి కుదిస్తూ జీవో నెంబరు 559తో నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకుగాను స్పీకరు తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్‌, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాస్‌చంద్రబోస్‌లతో పాటు బీసీ మంత్రులంతా తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యులు ఆనెపు రామకృష్ణ, పార్టీ సీనియర్‌ నాయకులు మజ్జి శ్రీరాములునాయుడు, పోలినాయుడు, పి.కృష్ణమూర్తి, శ్రీరామమూర్తినాయుడు, లక్కుపురం, డొంకలపర్త మాజీ సర్పంచులు శ్రీనివాసరావు, గణపతి, కె.కృష్ణ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.