గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఉదయం గొంతెనవానిపాలెం సచివాలయంలో శ్రీనగర్, చినగంట్యాడ ప్రాంత లబ్ధిదారులకు వైకాపా 63వ వార్డు అధ్యక్షుడు రాజాన రామారావు, శ్రీనివాస్ గౌడ్, సుజాత కార్డులు అందజేశారు. 63, 64, 50, 62 వార్డుల్లో జరిగిన కార్యక్రమంలో పల్లా చినతల్లి, షౌకత్ అలీ, డి.శ్రీను, కేబుల్‌మూర్తి, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అగనంపూడి : జీవీఎంసీ 53వ వార్డు పరిధి వడ్లపూడి వార్డు సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వైకాపా నాయకులు ఇ.గోవింద్, పి.వేణుబాబు, వెంకటరమణ, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.
అక్కిరెడ్డిపాలెం : జీవీఎంసీ 64వ వార్డులోని బొజ్జన్నకొండ, రాజీవ్‌నగర్, అప్పన్నకాలనీలో జరిగిన కార్యక్రమాల్లో వైకాపా వార్డు అధ్యక్షురాలు పల్లా చినతల్లి, సీఓ లక్ష్మీ, వైకాపా నాయకులు భరత్, త్రినాథ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
arogyasri cards