తెలంగాణ వార్షిక బడ్జెట్ సమావేశాలు
అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. తమిళిసై తొలిసారి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ తెలంగాణ ఏర్పాటైన కొత్తలో రైతు ఆత్మహత్యలు, వలసలు ఉండేవి. విద్యుత్, నీరు, ఎరువుల పరంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోంది. తక్కువ కాలంలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా ఎదిగింది. పక్కా ప్రణాళికతో కేసీఆర్ సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపారు’’ అని గవర్నర్ వివరించారు.