fees in ap schools

కొత్తవలస, న్యూస్‌టుడే: ఏప్రిల్‌ 25 నుంచి నిర్వహించనున్న ఏపీ సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రాసేందుకు అర్హత ఉండి, సకాలంలో రుసుము చెల్లించలేకపోయిన వారికి అధికారులు మరో అవకాశం కల్పించారు. వీరంతా తత్కాల్‌ పథకంలో ఈ నెల 6 నుంచి 11 రుసుము చెల్లించే వీలు కల్పించినట్లు డీఈవో జి.నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ పరీక్ష రుసుముకు అదనంగా పదో తరగతికి రూ.500, ఇంటర్‌కు రూ.వెయ్యి ఏపీ ఆన్‌లైన్‌/పేమెంట్‌ గేట్‌ వే ద్వారా చెల్లించవచ్చన్నారు. పూర్తి సమాచారానికి గుర్తింపు పొందిన సంస్థ (ఎక్రిడేటెడ్‌ ఇనిస్టిట్యూషన్‌/ఏ.ఐ) సమన్వయకర్తలను సంప్రదించాలని సూచించారు.