inter exams

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు 8.30 గంటలకే చేరుకోవాలని ఆర్‌ఐఓ సుజాత తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు నేరుగా తమ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్ఛు హాజరు సరిపోని విద్యార్థులు మాత్రమే బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ పేరు మీద చలానా, సంబంధిత ప్రిన్సిపల్‌ లెటర్‌ తీసుకుని వస్తే పిఠాపురంకాలనీలో ఉన్న బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో హాల్‌టిక్కెట్‌ పొందవచ్ఛు.


ప్రథమ సంవత్సరం విద్యార్థులు 56,411


ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 54,283


మొత్తం కేంద్రాలు 109


సమయం: ఉదయం 9 గంటల-12 గంటల వరకు


సమస్యలుంటే సంప్రదించవచ్చు:


టోల్‌ఫ్రీ నెంబర్‌: 0891- 2567561, 0891- 2552854