4,5 తేదీల్లో శాసనసభా కమిటీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ శాసనసభా కమిటీ (ఎపిఎల్‌ఎ) ఈ నెల 4,5వ తేదీల్లో మన్యంలో పర్యటించనుందని ఐటిడిఎ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4వ తేదీన ఉదయం 11 గంటలకు అనంతగిరి మండలంలోని బొర్రా గుహలకు చేరుకుంటారు. 11 గంటలకు అనంతగిరి మండలంలోని బొర్రా గుహలకు చేరుకుంటారు. ఒంటిగంటకు సుంకరమెట్ట కాఫీ తోటలను సందర్శిస్తారు. మధ్యాహ్నం అరకులోయ హరితా రిసార్ట్స్‌కు చేరుకుంటారు. 3 గంటలకు పెదలబుడు, గంజాయిగుడ పర్యాటక కేంద్రాలను, అనంతగిరి, అరకులోయలో ఐటిడిఎ ఏర్పాటు చేసిన గిరి గర్భిణీ స్త్రీల వసతి గృహాన్ని పరిశీలిస్తారు. ఆ తరువాత కాఫీ మ్యూజియం, గిరిజన మ్యూజియంను తిలకిస్తారు. అరకులోయ హరితా రిసార్ట్స్‌లో రాత్రి బస చేస్తారు. 5వ తేదీన ఉదయం 8.30 గంటలకు అరకులోయలో బయలుదేరి హుకుంపేట మండలంలో ఒక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి, భోజన సదుపాయాలను పరిశీలిస్తారు. 10 గంటలకు ఐటిడిఎ కార్యాలయానికి చేరుకొని ఎస్‌టి ఆర్గనైజేషన్లు, ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తారు. అనంతరం ఎస్‌టి రిజర్వేషన్ల అమలు, ఉప ప్రణాళికలో గిరిజన అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.