కరోనా వైరస్ నివారణకు జిల్లా అధికార యంత్రాంగం బాగా పనిచేస్తోందని కలెక్టర్ జె.నివాస్ ప్రశంసించారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తీసుకుంటున్న చర్యలపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలతోపాటు ఆదేశాలిచ్చారు. సమీక్షలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్-2 ఆర్.గున్నయ్య, డీఆర్వో బలివాడ దయానిధి, డ్వామా పీడీ హెచ్.కూర్మారావు, బీసీ కార్పొరేషన్ ఈడీ గుత్తు రాజారావు, మత్స్యశాఖ జేడీ డాక్టర్ వి.వి.కృష్ణమూర్తి, డీపీవో వి.రవికుమార్, జడ్పీ సీఈవో జి.చక్రధరరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.చెంచయ్య, జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ బొడ్డేపల్లి సూర్యారావు, ప్రత్యేకాధికారి జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.a
కరోనా నివారణ చర్యలో యంత్రాంగం పనితీరు భేష్