తండ్రిపై తనయుల దాడి

అన్నం వద్దని, రొట్టెలు కావాలని అడిగిన తండ్రిపై తనయులు దాడికి పాల్పడ్డ ఉదంతం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌ సాగర్‌ సొసైటీ సమీపంలోని ఇందిరానగర్‌ వద్ద భాగయ్య, తనయులు శ్రీను, రాజులతో కలిసి గుడిసెల్లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి తనకు అన్నం వద్దని.. రొట్టె కావాలని కొడుకులకు భాగయ్య చెప్పాడు. దీంతో వారు అన్నం పెట్టడమే ఎక్కువ.. రొట్టెలు కూడానా అంటూ అతని తలపై బేలంకట్టెతో కొట్టారు. తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. సోమవారం కోలుకున్న భాగయ్య.. కొంతకాలంగా తన కొడుకులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.