''నా కుమార్తెకు న్యాయం జరిగింది. ఆలస్యమైనప్పటికీ చివరకు న్యాయమే గెలిచింది. దోషుల ఉరితో నిర్భయ ఆత్మ శాంతిస్తుంది. ఈ క్రమంలో సహకరించిన న్యాయవ్యవస్థ, ప్రభుత్వం యంత్రాంగాన్ని నా కృతజ్ఞతలు. సుప్రీంకోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను నా కూతురి చిత్రపటాన్ని ఆలింగనం చేసుకుని ఈరోజు నీకు న్యాయం జరిగింది అని చెప్పాను. ఇంతటితో నా పోరాటం ఆగదు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది"
న్యాయం జరిగింది: నిర్భయ తల్లి