ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా జనతా కర్ఫ్యూను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చెప్పారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్వగృహం వద్ద స్థానికులతో కలిసి ఆయన చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా వైరస్‌ను నియంత్రించడానికి దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నిర్ణయించారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలంతా స్వచ్ఛందంగా ఇళ్లల్లోనే ఉండి విజయవంతం చేశారన్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
స్వచ్ఛందంగా విజయవంతం: ఎంపీ