పుర ఎన్నికలకు నేడు ప్రకటన
రాష్ట్రంలోని 103 పురపాలక, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆ ప్రకారం ఎస్టీ మహిళ 1, ఎస్సీ మహిళ 7, బీసీ మహిళలకు 17, మహిళ జనరల్ కోటాలో 26 కలిపి మొత్తం 51 స్థానాలను మహిళలకు కేటాయించారు. పురపాలకశాఖ కమిషనర్ విజయకుమార్ ఆదివారం రిజర్వేషన్లకు సంబంధించిన రాజపత్రాన్ని (గెజిట్) విడుదల చేశారు. ఇదే పురపాలక సంఘాల్లో 2,123 వార్డు సభ్యుల స్థానాలకూ రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. పురపాలక, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషనర్ సోమవారం ప్రకటన (నోటిఫికేషన్) జారీ చేయనున్నారు.