సీఎం జగన్‌కు సలహాదారు.. రాజస్థాన్ నుంచి పిలుపు.. కేబినెట్ హోదా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సలహాదారుడి (ఆర్థిక వనరుల సమీకరణ)గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ఆయనను నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటూ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జారీ చేసింది. మరోవైపు, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రాను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి(ఆర్థిక వనరుల సమీకరణ)గా నియమించింది. ఏపీ ఆర్థిక సంస్థ ఎండీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొంది.