భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 437 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బాధితుల సంఖ్య 13వేలు దాటింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1007 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మొత్తం బాధితుల్లో 1749 మంది కోలుకోగా ప్రస్తుతం మరో 11,201మంది చికిత్స పొందుతున్నారు. గడచిన మూడురోజుల్లో దేశంలో దాదాపు వేయి మంది కోలుకోవడం కాస్త ఉపశమనం కలిగించే విషయం.