రేషనుకార్డులకు6వేల మందిఅర్హులు

నగరంలో రేషనుకార్డులు పొందేందుకు 6 వేల మంది అర్హులున్నారు. ఇటీవల వీరంతా దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైనప్పటికీ రేషను కార్డుల్లేక ప్రభుత్వం అందజేసే పరిహారం పొందలేకపోతున్నారు. వీరంతా గత కొద్దిరోజుల నుంచి సరకులు ఉచితంగా అందించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్లు చేసి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన వారికి తక్షణమే రేషనుకార్డులు జారీ చేసి కరోనా సహాయాన్ని వర్తింప చేయాలని సీఎం ఇటీవల వీసీ ద్వారా జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో అర్హులైన వారి జాబితాలను యంత్రాంగం సిద్ధం చేస్తోంది. దీని ప్రకారం 6 వేలమంది లెక్క తేలారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తుది మార్గదర్శకాలు రాగానే కార్డులను అందజేసి ప్రభుత్వ సహాయాన్ని ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.