కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలాడిపోతుంది. ఈ మహమ్మారి కట్టడికి చాలా దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. భారత్‌లో కూడా మొదట ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించగా దానిని మే 3 వరకు పొడిగించారు. దీంతో మన తోటి మనుషులు ఎంతో మంది రోజుకు ఒక్క పూట కూడా ఆహారం దొరకక పస్తులు ఉంటున్నారు. లాక్‌డౌన్‌కి ముందు కష్టం చేసుకొని స్వశక్తితో బతికిన ఎంతో మంది వలసకూలీలు, దినసరి కూలీలు, నిరుపేదలు ఆకలితో నీళ్లు తాగి పడుకునే దుస్థితి దాపురించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను, వలస కూలీలను ఆదుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దీనికి తోడు అనేక స్వచ్ఛంధ సంస్థలు, సామాన్యులు సైతం ఈ సమయంలో ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. పేదలకు నిత్యవసర సరుకులు, ఆహారాన్ని అందిస్తున్నారు. అలా సాయం చేస్తున్న వారు సాక్షి.కామ్ ద్వారా వాళ్ల సేవ కార్యక్రమాన్ని తెలిపి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
నిరుపేదలకు జీవీఎంసీ చేయూత