సుప్రీం కోర్టుకు వెళతాం










విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌








ఇంగ్లిష్‌ మీడియం జీవోల రద్దుపై హైకోర్టు జడ్జిమెంట్‌ కాపీ చూశాక అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును విజయంగానో, అపజయంగానో చూడొద్దన్నారు. ఇంగ్లిష్‌ మీడియం అమలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ చెబుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు.