పదవి పోయిందనే ఫ్రస్టేషన్‌తో చంద్రబాబుకు మతిభ్రమించిందని.. అందుకే విలువలు వదిలేసి స్వార్థ రాజకీయాల కోసం మానవ జాతికే కీడు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఆదివారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. ప్రజలంతా ఏకమై అధికార పీఠం నుంచి చంద్రబాబును దించేసినా ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమలో పిచ్చి చేష్టలు చేస్తున్నారు. తన ‘ముత్యాల ముగ్గు’ బృందంతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ.. లేనిపోని ఆరోపణలతో రోజుకో లేఖ రాస్తూ చంద్రబాబు తన రాక్షస ప్రవృత్తిని చాటుకుంటున్నారు. చినబాబు ‘సైకిల్’ తొక్కాలని ఆశ పడుతుంటే.. పెదబాబు మాత్రం సైకిల్ దిగట్లేదు. పార్టీని కరోనా గబ్బిలంలా పట్టుకు వేలాడుతున్నారు. రాజకీయాల్లో లోకేష్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ పదవి పోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేసి గెలవలేరు. రాజ్యసభకు వెళ్దామ
చంద్రబాబుకు మతిభ్రమించింది